ఐరన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి | How To Start Iron Business in Telugu
ఒక బిజినెస్ మొదలుపెట్టడం అంటే పెద్ద నిర్ణయం. ఇందులో పక్కా ప్లానింగ్, కష్టపడి పనిచేయడం, సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం. ఐరన్ బిజినెస్ కూడా అలాగే. ఇది ఎప్పటికప్పుడు డిమాండ్ ఉండే బిజినెస్, అయితే సక్సెస్ కావాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వాటిని వివరంగా చూద్దాం.
1. మార్కెట్ ని అర్థం చేసుకోవడం | Understand Market
ముందుగా మీ ప్రాంతంలోని మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి,మీ area లో ఐరన్ మరియు స్టీల్ ప్రోడక్ట్స్ కి ఎంత డిమాండ్ ఉందో రీసెర్చ్ చేయండి,మీ ప్రాంతంలో ఉన్న పోటీదారుల గురించి తెలుసుకోండి. వాళ్ళు ఏ రకాల ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, ఏ రకాల సర్వీసులను ఇస్తున్నారు అని తెలుసుకోండి,కస్టమర్లు ఎక్కువగా ఎలాంటి ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తున్నారో, ఏ ప్రోడక్ట్స్ కి ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవడం ముఖ్యం.
2. సరైన లొకేషన్ | Location
లొకేషన్ ఎంపిక చాలా ముఖ్యం. మీ షాప్ లో ఎక్కువ public ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉండాలి,Traffic ఎక్కువగా ఉండే main road లేదా construction area లా దగ్గర లొకేషన్ ఎంచుకోవడం మంచిది,మీ షాప్ దగ్గర పార్కింగ్ సౌకర్యం ఉండాలి. ఇలా ఉంటే కస్టమర్లు సులభంగా మీ షాప్ కి రాగలరు.
3. అవసరమైన అనుమతులు | Registration
బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అన్ని Legal Permissions, Licenses తీసుకోవాలి,స్థానిక మున్సిపల్ కౌన్సిల్ నుండి బిజినెస్ లైసెన్స్ పొందండి.
GST రిజిస్ట్రేషన్ చేయండి,Shop and Establishment License తీసుకోండి,మరొక ముఖ్యమైనది, Fire safety సర్టిఫికేట్.
4.Investment and Commodity Selection
ఐరన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సరైన పెట్టుబడి కావాలి,సుమారు 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెట్టుబడి అవసరం.
రాడ్లు, ప్లేట్లు, యాంగిల్స్, సీమ్ లెస్ ట్యూబులు వంటి ఐరన్ ప్రోడక్ట్స్ కొనండి,సరైన suppliers నీ వెతికీ, మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో మీ స్టాక్ ఫుల్ చేయండి.
5. Staffఎంపిక | Staff Selection
బిజినెస్ లో కస్టమర్లతో వ్యవహరించడానికి, సరుకులు హాండిల్ చేయడానికి నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం.కస్టమర్లను బాగా హాండిల్ చేయగల, Sales skills ఉన్న సిబ్బంది ఎంపిక చేయండి,సిబ్బందికి శిక్షణ ఇవ్వండి. ఇవ్వడం ద్వారా వారికి అవసరమైన skills ఉంటాయి.
6. Shop settings
మీ షాప్ సౌకర్యవంతంగా ఉండాలి.కస్టమర్లు రాగానే సులభంగా మీ ప్రోడక్ట్స్ చూసేలా సెటప్ చేయండి.Cement floor, proper lighting, attractive shelves తో మీ షాప్ ని అద్భుతంగా డిజైన్ చేయండి.ప్రోడక్ట్స్ సులభంగా కనిపించేలా, క్లీన్ గా arrangeచేయండి.
7. Promotions and marketing
మీ బిజినెస్ ప్రమోషన్ కోసం మొదట్లో బ్యానర్లు, పోస్టర్లు వాడండి.డిజిటల్ ప్రమోషన్ కూడా చాలా ముఖ్యం. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వాడి మీ బిజినెస్ గురించి ప్రజలకు తెలియజేయండి,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ వాడి మీ బిజినెస్ గురించి ప్రమోట్ చేయండి.
8:Customer service :
మంచి కస్టమర్ సర్వీస్ అనేది మీ బిజినెస్ కి పిలర్ లాంటిది.కస్టమర్లకు సమయానికి సరుకులు డెలివరీ చేయడం, క్వాలిటీ మెటీరియల్స్ అందించడం చాలా ముఖ్యం.కస్టమర్ల సమస్యలను త్వరగా పరిష్కరించడం, వారికి మంచి అనుభవం కలిగించడం ద్వారా మీ బిజినెస్ మంచి లాభాదియకంగా ఉంటుంది .
9.Maintenance and Updates:
మీ షాప్ మరియు ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేయండి.అవసరమైన రిపేర్లు చేయించుకోండి.మీ షాప్ క్లీన్ గా ఉండెలా చూసుకోండి.కొత్త ప్రోడక్ట్స్ తీసుకురండి, మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ నీ పాటించండి.
10. Profit and Expansion:
ఒకసారి ప్రాఫిట్ రావడం మొదలుపెట్టాక, బిజినెస్ ని expand చేయండి కొత్త బ్రాంచెస్ నీ స్టార్ట్ చేయండి,బిజినెస్ ని మరింత విస్తరించి, మీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండి.
11.Strong relationships with suppliers:
సప్లయర్లు మీ బిజినెస్ కి ఒక ముఖ్యమైన భాగం,మీరు ఎంపిక చేసే సప్లయర్లు. నమ్మకమైన వారై, క్వాలిటీ మెటీరియల్స్ అందించే వారు కావాలి.
సప్లయర్లతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం ద్వారా మీకు మంచి ధరలు పొందడం, అవసరమైన సమయంలో సరుకులు అందించడం సులభమవుతుంది, సప్లయర్లకు రెగ్యులర్ గా ఆర్డర్స్ ఇస్తూ, వాళ్ళు ఇచ్చే సర్వీస్ పై మీ అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా బంధం మెరుగుపరుచుకోండి.
12. Customer feedback:
కస్టమర్ ఫీడ్‌బ్యాక్ మీ బిజినెస్ అభివృద్ధికి crucial లాంటిది,కస్టమర్ల అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి,ఫీడ్‌బ్యాక్ ద్వారా మీ బిజినెస్ లో ఉన్న Errors, ఇంప్రూవ్మెంట్ అవశ్యకతలు తెలుసుకుని, తగిన మార్పులు చేసుకోండి,కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ మీరు వినడం వలన మన products quality గురించి, service గురించి తెలుసుకొని వాళ్లకు కావలిసిన విదంగా మీరు అందిస్తే మీ బిజినెస్ ని మరింత నమ్మకం తో చూస్తారు.
13. కొత్త technologyఉపయోగించడం:
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వాడకం తప్పనిసరి,మీ బిజినెస్ లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా మీ పని మరింత సులభం అవుతుంది.
ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, బిల్లింగ్ సిస్టమ్, ఆర్డర్ ట్రాకింగ్ వంటి పనుల్లో టెక్నాలజీ ఉపయోగించండి, ఈ టెక్నాలజీ మీకు సమయాన్ని మరియు ఖర్చును ఆదా చేస్తుంది.
14. Networking and Community Involvement:
నెట్‌వర్కింగ్ మీ బిజినెస్ కు మరొక ప్రధాన అంశం,స్థానిక వ్యాపార సంఘాల సమావేశాలలో పాల్గొనండి,ఇతర వ్యాపారులతో సంబంధాలు మెరుగుపరుచుకోండి,స్థానిక సంఘాలతో కమ్యూనిటీ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ బిజినెస్ గురించి మరింత ప్రజలకు తెలియజేయండి అలా ఇంకా అందరికి తెలుస్తుంది.
15.Risk Management:
ప్రతి బిజినెస్ కి రిస్కులు ఉంటాయి. వాటిని Consider చేసి ముందుకు సాగాలి.బిజినెస్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా మీ బిజినెస్ రిస్కులను తగ్గించుకోండి,Funds, raw materials, market పరిస్థితులు వంటి అంశాలను consider చేసి రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్ సిద్ధం చేయండి.
అనుకున్న ప్లాన్ ప్రకారం వ్యవహరించడం ద్వారా రిస్క్ లను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చు.
16. Regular audit:
మీ బిజినెస్ లో సమయానికి ఆడిట్ చేయడం చాలా ముఖ్యం.మీ Financial statements, inventory, sales reports ను regularly గా చెక్ చేయండి.
రిపోర్ట్స్ ద్వారా మీ బిజినెస్ లో ఉన్న లోపాలను, అవసరమైన మార్పులను గుర్తించి, తగిన చర్యలు తీసుకోండి.
మంచి ఆడిట్ ప్రాక్టీసెస్ అనేవి మీ బిజినెస్ కి పిలర్ లాంటివి.
17.Professional consultation :
ప్రొఫెషనల్ కన్సల్టెంట్ల సహాయం తీసుకోవడం ద్వారా మీ బిజినెస్ ని మెరుగుపరుచుకోవచ్చు,Market Analyst, Financial Advisor, Legal Expert వంటి ప్రొఫెషనల్స్ సలహాలు తీసుకుని, మీ బిజినెస్ లో తగిన మార్పులు చేయండి.
ప్రొఫెషనల్స్ సలహాలు మీకు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి.
18. కస్టమర్లకు ఆఫర్లు:
కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం ద్వారా వాళ్ళను ఆకర్షించవచ్చు.
ప్రత్యేక దినాలు, పండగ సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా కస్టమర్లను మీ షాప్ కి రావడానికి చాలా ఆసక్తి నీ చూపుతారు అలా మీ వ్యాపారం ఇంకా బాగా జరుగుతుంది.రెగ్యులర్ కస్టమర్లకు లాయల్టీ ప్రోగ్రామ్ లాంటివి ప్రవేశపెట్టండి.
19. Online presence (ఆన్‌లైన్ ప్రెజెన్స్):
ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ప్రెజెన్స్ చాలా ముఖ్యం.
మీ బిజినెస్ కి ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ ఉండాలి.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వాడి మీ బిజినెస్ ప్రమోట్ చేయండి.
గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ సృష్టించి, కస్టమర్లకు సులభంగా కనపడేలా చేయండి.
my view:
ఐరన్ బిజినెస్ ఒక మంచి ఆప్షన్, కానీ సక్సెస్ కావాలంటే కష్టపడాలి, ఓపికతో ఉండాలి. కస్టమర్లకు మంచి సర్వీస్, నాణ్యమైన ప్రోడక్ట్స్ అందించడం ద్వారా మీరు మీ బిజినెస్ ని విజయవంతం చేయవచ్చు.
WhatsApp Business నీ ఎలా create చేయాలి