WhatsApp Business నీ ఎలా create చేయాలి | How To Craete WhatsApp Business In Telugu
WhatsApp బిజినెస్ అనేది సాధారణ WhatsApp కంటే కొత్తగా వచ్చిన అప్లికేషన్. ఇది బిజినెస్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ అప్లికేషన్‌తో మీరు మీ కస్టమర్లతో త్వరగా మరియు సులువుగా కమ్యూనికేట్ చేయవచ్చు. మరి మనం ఎలా WhatsApp బిజినెస్ అకౌంట్ ఎలా చేయాలో చూద్దాం.
Step-1 : Application Download
ముందుగా, మీ ఫోన్లో WhatsApp బిజినెస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి. Playstore లేదా apple store లోకి వెళ్ళి “WhatsApp Business” అని టైప్ చేసి, install చెయ్యండి.
Step-2: phone number verify
Install అయ్యాక, application open చేసి, మీ బిజినెస్ కోసం వాడే ఫోన్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఆ ఫోన్ నంబర్ కి ఒక OTP వస్తుంది, ఆ OTP ని ఎంటర్ చేస్తే మీ నంబర్ వెరిఫై అవుతుంది.
Step- 3: business వివరాలు enter చేయడం
ఇప్పుడు మీ బిజినెస్ గురించి సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
మీ బిజినెస్ పేరు
ప్రొఫైల్ ఫోటో (మీ బిజినెస్ లోగో లేదా మీ షాప్ ఫోటో)
మీ బిజినెస్ కేటగిరీ (ఉదాహరణకు, రెస్టారెంట్, దుకాణం, సర్వీస్ ప్రొవైడర్)
మీ బిజినెస్ అడ్రస్
మీ బిజినెస్ టైమింగ్స్
Step 4: Quick Replies ను మరియు Automatic Message set చేయడం
WhatsApp బిజినెస్ లో Quick Replies , Automatic Message వంటి మంచి features ఉన్నాయి.
Quick Replies: తరచుగా మీరు వాడే మెసేజెస్ ని మీరు సేవ్ చేసుకోవచ్చు, అప్పుడు మీరు వాటిని సులభంగా సెన్డ్ చేయవచ్చు.
Automatic Message: మీకు ఎక్కువగా పని లేకుండా ఆటోమేటిక్ గ అదే పంపిస్తుంది.
Step-5: labels నీ ఎలా వాడటం
మీ కస్టమర్లని, ఆర్డర్స్ ని ట్రాక్ చేయడానికి లేబుల్స్ చాలా ఉపయోగపడతాయి.
New customer: కొత్త కస్టమర్ల కోసం.
Pending Payment: ఇంకా పేమెంట్ రావలసిన వాళ్ళ కోసం.
Completed Orders: పూర్తయ్యిన ఆర్డర్స్ కోసం.
Step- 6: Adding Products and Services
మీరు మీ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ని WhatsApp బిజినెస్ లో add చేయవచ్చు . ఇది మీ కస్టమర్లకి మీరు ఏమి ఆఫర్ చేస్తున్నారో తెలియజేయడానికి ఉపయోగపడుతుంది.
Product Name : మీరు అమ్మే ప్రొడక్ట్ పేరు.
Description: ప్రొడక్ట్ గురించి వివరణ.
Prize: ప్రొడక్ట్ ధర.
Photo: ప్రొడక్ట్ ఫోటో.
Step 7: Customer Statistics చూడటం
WhatsApp బిజినెస్ లో మీరు మీ Messages effect ఎలా ఉందో చూడవచ్చు.
Sent messages: మీరు ఎంతమందికి మెసేజ్ పంపించారో.
Delivered message: ఎంతమందికి డెలివర్ అయ్యాయో.
Redd messages: ఎంతమంది మీ మెసేజ్ చదివారో.
Step-8: WhatsApp web ఉపయోగించడం
మీ ఫోన్ కాకుండా, మీరు కంప్యూటర్ లేదా లాప్టాప్ లో కూడా WhatsApp బిజినెస్ వాడుకోవచ్చు.
WhatsApp web : వెబ్ సైట్ లోకి వెళ్ళి మీ ఫోన్ లోని WhatsApp బిజినెస్ అప్లికేషన్ తో స్కాన్ చేయాలి.
Desktop application: మీ కంప్యూటర్ లో డెస్క్‌టాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు.
Step-9: WhatsApp payments set చేయడం
WhatsApp బిజినెస్ లో మీరు పేమెంట్స్ ని కూడా సెట్ చేయవచ్చు.
Bank account Link : మీ బ్యాంక్ అకౌంట్ ని WhatsApp కి లింక్ చేయాలి.
UPI ID set : మీ యూపీఐ ఐడీ ని సెట్ చేసి, పేమెంట్స్ తీసుకోవచ్చు.
Final Tips:
ఇలా మీ WhatsApp బిజినెస్ అకౌంట్ ని సృష్టించవచ్చు. ఇది మీ బిజినెస్ ని మరింత ఎఫెక్టివ్ గా మరియు సులభంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. మీ కస్టమర్లతో కమ్యూనికేషన్ బాగా జరగటంతో పాటు, మీ సర్వీసెస్ మరియు ప్రొడక్ట్స్ ని సులభంగా ప్రమోట్ చేయవచ్చు.
అయితే, ఈ ప్రాసెస్ లో ఏదైనా సమస్య వస్తే, మీరు WhatsApp కస్టమర్ సపోర్ట్ కి సంప్రదించవచ్చు. మీరు ఎలా అయితే WhatsApp బిజినెస్ వాడుతారో, మీ బిజినెస్ కి అది అంతలా ఉపయోగపడుతుందో మీరు కూడా గమనించగలరు.