హలో ఫ్రెండ్స్! మీ అందరికీ నమస్తే. మీ కోసం మన తెలంగానా టచ్ తో 10 అదిరిపోయే బిజినెస్ ఐడియాస్ తీసుకొచ్చాం. ఈ ఐడియాస్ మీకు కొత్తగా ఉండవచ్చు కానీ ట్రై చేసి చూస్తే చాలు సక్సెస్ అవ్వచ్చు. స్మాల్ ఇన్వెస్ట్ మెంట్ తో గ్రాండ్ గా ప్రారంభించడమే మన టార్గెట్. మరి ఆలస్యం ఎందుకు, ముందుకెళ్లి చదివేయండి ఫ్రెండ్స్!
Business ideas in Telugu
1. ఆర్గానిక్ ఫార్మింగ్ | Organic Farming
ఇప్పుడు జనాలకు హెల్త్ మీద పిచ్చి ఎక్కువయింది. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే పల్లెటూర్ల దగ్గర చాలా డిమాండ్ ఉంటుంది. మీరు తక్కువ పెట్టుబడి తో ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు, మరియు ఇతర ఉత్పత్తులు ఉత్పత్తి చేసి, వాటిని మార్కెట్లో అమ్మితే మంచి లాభం వస్తుంది. మీకు పంటల పెంపకం గురించి చాలా అవగాహన అవసరం.
మీ పంటలను స్థానిక మార్కెట్లలో, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ లో కొనుకోవచ్చు. ఆరోగ్య కరమైన ఉత్పత్తుల కోసం పెద్ద పెద్ద నగరాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మీరు సేంద్రీయ సాగు ద్వారా రసాయన ముక్తమైన ఆహారాన్ని ప్రజలకు అందించి, ఆరోగ్యవంతమైన సమాజన్నీ మనం తయారు చేయవచ్చు.
2. హోమ్ బేకరీ | Home Bakery
ఇంట్లో కేక్స్, కుకీస్, బ్రెడ్స్ వంటి వంటలు చేయడంలో మీకు ఇష్టం ఉంటే, హోమ్ బేకరీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు హోమ్ మేడ్ ఫుడ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా సులభంగా అమ్మగలరు. మీ కేక్స్ పర్ఫెక్ట్ గా ఉంటే కస్టమర్స్ క్విక్ గా పెరుగుతారు.
బేకరీ మొదలు పెట్టడానికి మీరు కొన్ని అవసరమైన వస్తువులు కొనాలి. మొదట్లో మీ స్నేహితులు, బంధువులు కస్టమర్లు అవుతారు. వారి ఫీడ్ బ్యాక్ తో మీ ఉత్పత్తులను పెంచుకోండి . సోషల్ మీడియా ద్వారా మీ బేకరీని ప్రమోట్ చేయడం ద్వారా మరింత కస్టమర్లను ఆకర్షించవచ్చు.
3. ఫిట్నెస్ ట్రైనింగ్ | Fitness Training
ఇప్పుడు ఫిట్నెస్ కి చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు ఫిట్నెస్ ట్రైనర్ అయితే, లేదా ఫిట్నెస్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే, చిన్న జిమ్ లేదా ఫిట్నెస్ స్టూడియో ప్రారంభించండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా నిర్వహించవచ్చు.
మీకు సరైన జిమ్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసి, మంచి వర్కౌట్ ప్రోగ్రామ్స్ రూపొందించాలి. మీరు ప్రొఫెషనల్ గా ఉంటే, మీ కస్టమర్లు ఎక్కువమంది అవుతారు. వ్యాయామం,ఫుడ్ గురించి అవగాహన కలిగించడం ద్వారా మీరు వారి ఆరోగ్యాన్ని మంచిగా ఉండేలా చేయవచ్చు.
4. చిల్డ్రన్ డే కేర్ సెంటర్ | Children Day Care Center
ఇప్పుడు చాలా మంది బిజీ బిజీ జాబ్ చేస్తున్నారు, వీళ్లకు పిల్లలను చూసుకోవడం కష్టమవుతుంది. మీకు పిల్లలను చూసుకోవడంలో ఇష్టం ఉంటే, ఒక చిన్న డే కేర్ సెంటర్ ప్రారంభించండి. మంచి కేర్, ఆకర్షణీయమైన ప్లే ఏరియా ఉంటే, ఎక్కువ మంది తల్లిదండ్రులు మీ దగ్గరకి వస్తారు.
చిన్నారులకు ప్రేమతో, కేర్ తో చూసుకుంటే తల్లిదండ్రులు మీకు నమ్మకంతో పిల్లలను ఇచ్చేస్తారు. మంచి ఫెసిలిటీలు కలిగి ఉంటే, డే కేర్ సెంటర్ సక్సెస్ అవ్వడం ఖాయం.
5. ఇవెంట్ ప్లానింగ్ | Event Planning
ఇవెంట్ ప్లానింగ్ అంటే మనకు తెలిసిన పెళ్లిళ్లు, ఫంక్షన్లు, బర్త్ డేస్, పార్టీలు ఇలా ఏవైనా కావచ్చు. మీరు క్రియేటివ్ గా ఉంటే, ఇలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేసి మంచి లాభం సంపాదించవచ్చు.
మంచి వర్క్ చేస్తే కస్టమర్స్ రెఫరెన్స్ ద్వారా క్విక్ గా పెరుగుతారు. మీ క్లైంట్స్ యొక్క అవసరాలు తెలుసుకొని, వాటిని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడం మీ బాధ్యత. మంచి డెకరేషన్, విందు, వినోదం కలిగించినా కస్టమర్స్ మిమ్మల్ని మెచ్చుకుంటారు.
6. హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్ ఐటమ్స్ | HandMade Craft Items
ఇంట్లో చేయగలిగే చిన్న చిన్న క్రాఫ్ట్ ఐటమ్స్ ను తయారు చేసి వాటిని ఆన్లైన్ లో అమ్మండి. ఈరోజుల్లో హ్యాండ్‌మేడ్ ఐటమ్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. మీరు చెయ్యవలసిన పని కేవలం మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేయడం మరియు వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం.
మంచి క్రియేటివిటీ, పర్సనల్ టచ్ ఉంటే మీ ఉత్పత్తులు మరింత ప్రజల నోటిలో ఉండిపోతారు . amazon వంటి వెబ్ సైట్లు మీ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్మడానికి ఉపయోగపడతాయి.
7. ఫ్రీలాన్సింగ్ | Freelancing
మీకు కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ లాంటివి తెలుసు కదా! అయితే ఫ్రీలాన్సర్ గా స్టార్ట్ చేయండి. ఫ్రీలాన్సింగ్ సైట్స్ ద్వారా కస్టమర్స్ ని కలవండి , మీ సర్వీసెస్ అందించండి.
ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు. మొదట్లో మీ సర్వీసెస్ గురించి ప్రొఫైల్స్ రూపొందించుకొని, మంచి రివ్యూస్ వచ్చేలా చేసుకోండి. కస్టమర్స్ కి మంచి సర్వీస్ అందిస్తే, వారు మిమ్మల్ని రికమండ్ చేస్తారు.
8. ఫుడ్ ట్రక్ | Food Truck
మనం తెలంగాణా బిర్యానీ, పులిహోర, గోంగూర పచ్చడి లాంటివి తీసుకొని ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేస్తే అదిరిపోయే బిజినెస్ అవుతుంది. చిన్న పెట్టుబడి తో స్టార్ట్ చేసి, టేస్టీ ఫుడ్ తో కస్టమర్స్ ని ఆకట్టుకోండి.
సరైన లొకేషన్ సెట్ చేసుకుంటే సక్సెస్ అవ్వడం సులభం. మీ ఫుడ్ ట్రక్ కి యూనిక్ పేరుతో పాటు, అట్రాక్టివ్ డిజైన్ ఉండాలి. ఫుడ్ ట్రక్ ని ఫెస్టివల్స్, మార్కెట్స్, కాలేజెస్ వంటి ప్రదేశాలలో పార్క్ చేస్తే, కస్టమర్స్ ఎక్కువగా వస్తారు.
9. బ్యూటీ పార్లర్ | Beauty Parlour
మీకు బ్యూటీ ట్రీట్మెంట్స్, హెయిర్ కటింగ్, మేకప్ లాంటి స్కిల్స్ ఉంటే, బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయండి. మహిళలు, పురుషులు అందరికీ అవసరమైన సర్వీసెస్ అందించి, మంచి లాభం పొందవచ్చు.
మంచి సర్వీసెస్ అందిస్తే కస్టమర్స్ యూనిక్కే వస్తారు. మీరు కస్టమర్లకి నమ్మకం కలిగిస్తే, రెగ్యులర్ కస్టమర్స్ గా మారతారు. మంచి క్వాలిటీ ప్రాడక్ట్స్ ఉపయోగించడం ద్వారా వారు హ్యాపీ గ ఫీల్ అవుతారు .
10. అగ్రికల్చరల్ టూరిజం | Agriculture Tourism
మీకు రైతులకు, పల్లెటూర్లకు అంకితభావం ఉంటే, అగ్రికల్చరల్ టూరిజం స్టార్ట్ చేయండి. సిటీలో ఉండే వారికి పల్లె జీవితం ఎలా ఉంటుందో చూపించి, వారితో అనుభవం పంచుకోవడం ద్వారా మంచి ఆదాయం సంపాదించవచ్చు.
పల్లె జీవనాన్ని నగరవాసులకు పరిచయం చేయడం, రైతుల జీవితాలను మెరుగుపరచడం మీ లక్ష్యం. సేంద్రీయ వ్యవసాయం, పశుపోషణ, సంప్రదాయ వ్యవసాయం లాంటి అనుభవాలను పంచుకోవడం ద్వారా మీరు మన సంస్కృతిని నిలబెట్టవచ్చు.
ఇవీ మాకు తెలిసిన, మీకు ఉపయోపడే 10 బిజినెస్ ఐడియాస్. మీకు ఎలాంటి బిజినెస్ ఐడియా నచ్చిందో, దాన్ని ఎంచుకొని, మన తెలంగాణ లో గ్రాండ్ గా స్టార్ట్ చేయండి. స్మాల్ స్టెప్స్ తో పెద్ద సక్సెస్ సాధించండి. మనకు తెల్సిందే కదా, పని చేస్తేనే పది మందికి ఆదర్శం అవుతాం. సో, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్!
How To Start Sompu Business In Telugu 2024